Table of Contents
Sande Poddula kada Song Lyrics in Telugu – Abhilasha Movie
చిరంజీవి , రాధిక జంటగా నటించిన అభిలాష చిత్రం 1983 లో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించగా, క్రియేటివ్ కమర్సియల్స్ పతాకం పై రామారావు నిర్మించారు . ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలూ సమకూర్చారు
Sande Poddula kada Song Lyrics in Telugu
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడోకొండాకోన జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ పిల్ల పాప నిదరే పోయే వేళ
కలలో కౌగిల్లే కన్నులు దాటాల
ఎదలే పొదిరిల్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
మల్లె జాజి మత్తు చల్లే వేళ పిల్లా గాలి జోల పాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుట్టకళ్ళు తాగాల
పగలే ఎన్నెల గుమ్మా చీకటి గువ్వాలాడాల
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది