Padara Padara Song Lyrics in Telugu – Maharshi Movie

| | ,

Padara Padara Song Lyrics in Telugu – Maharshi Movie

మహేష్ బాబు , పూజ హెడ్గే, అల్లరి నరేష్  జంటగా నటించిన మహర్షి చిత్రం 2019 లో  విడుదల అయ్యింది. ఈ చిత్రానికి  వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివీపి సినిమ  పతాకం పై దిల్ రాజు, అశ్విని దత్, ప్రసాద్ వీ పొట్లూరి, పరం వీ పొట్లూరి, కవిన్ అన్నే నిర్మించారు  . ఈ చిత్రానికి  దేవి శ్రీ ప్రసాద్  స్వరాలూ సమకూర్చగా  ఎస్ . ఎస్ . తమన్  బ్యాక్గ్రౌండ్ స్వరాలు అందించారు .

Padara Padara song lyrics in Telugu

Padara Padara Song Lyrics in Telugu – Maharshi Movie

భల్లుమంటూ నింగివొళ్ళు విరిగెను గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరచుకున్నవేళన చినుకు పూలవాన!
సముద్రమెంత దాహమేస్తే వెతికేను ఊటబావినే
శిరస్సువంచి శిఖరమంచు ముద్దిడే మట్టినేలనే…

పదరా.. పదరా.. పదరా !
నీ అడుగికి పదును పెట్టి పదరా!
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా !

పదరా.. పదరా.. పదరా !
ఈ పుడమిని అడిగిచూడు పదరా !
ఈ గెలుపను మలుపు ఎక్కడను ?
ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా !

నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా,
ఈ పథమున మొదటడుగైరా,
నీతరమిదిరా, అనితరమిదిరా అని చాటేయ్ రా!

|| పదరా.. పదరా.. పదరా నీ అడుగికి ||
|| పదరా.. పదరా.. పదరా ఈ పుడమిని ||
|| భల్లుమంటూ ||

కదిలే ఈకాలం, తన రగిలే వేదనికి,
బదులల్లె విసిరిన ఆశల బాణం నువ్వేరా
పగిలే ఇల హృదయం, తన యెదలో రోదనికి,
వరమల్లె దొరికిన ఆఖరిసాయం నువ్వేరా!

కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక,
విలపించేటి ఈభూమివొడి చిగురించేలా..!

పదరా.. పదరా.. పదరా !
ఈ హలమును భుజముకేత్తి పదరా,
ఈ నేలను ఎదకు హత్తుకుని
మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా

పదరా.. పదరా.. పదరా !
ఈ వెలుగును పలుగుదించి పదరా
పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా..!

నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం,
చినుకల్లె మొదలై, ఉప్పెన కాదా ఈ కధనం,
నీలో ఈజడికి, చెలరేగే అలజడికి,
గెలుపల్లె మొదలై, చరితగా మారే నీ పయనం,
నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసాక,
నువ్వు లక్ష్యమని, తమ రక్షవని నినదించేలా!

పదరా.. పదరా.. పదరా !
నీగతముకు కొత్త జనన మిదిరా,
నీ ఎత్తుకు తగిన లోతు ఇది
తొలి పునాది గది తలుపు తెరిచి పదరా!

పదరా.. పదరా.. పదరా !
ప్రతోక్కరి కథవు నువ్వు కదరా
నీ ఒరవడి భవిత కళల వొడి
బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా..!

తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం,
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చిపెంచిన కాంతిచుక్కవో
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో….!

Padara Padara Song Lyrics in English – Maharshi Movie

Bhallumantu ningi vollu virigenu
Gaddi parakathona
Edaari kallu theruchukunna velana
Chinuku poola vaana
Samudhramentha daahamesthe
Vethikenu oota bhaavine
Sirassu vanchi
Sikaramanchu mudhide
Matti nelaney

Padara padara padara
Nee adugiki padunu
Petti padara
Ee adavini chadunu cheyyimari
Vethukuthunna siri
Dorukuthundi kadha raa

Padara padara padara ee pudamini
Adigi choodu padara
Ee gelupanu malupu ekkadanu
Prashnalannitiki samadhaanamidira

Bhallumantu ningi vollu virigenu
Gaddi parakathona
Edaari kallu theruchukunna velana
Chinuku poola vaana
Samudhramentha daahamesthe
Vethikenu oota bhaavine
Sirassu vanchi
Sikaramanchu mudhide
Matti nelaney

Kadhile ee kaalam
Thana ragile vedhanaki
Badhulalley visirina
Aasala baanam nuvveraa

Pagile ila hrudayam
Thana yedhalo rodhanaki
Varamalle dhorikina aakhari
Saayam nuvveraa

Kanureppalalo thadi endhukani
Thananadigey vaade leka
Vilapincheti ee bhoomi odi
Chigurinchelaa

Padara padara padara
Ee halamunu bhujamuketthi padara
Ee nelanu edhaku hatthukoni
Molakaletthamani
Pilupunicchi padaraa

Padara padara padara
Ee veluganu palugu dinchi padara
Pagullatho panikiraanidanu
Brathuku bhoomilika
Methukulicchu kadaraa

Neelo ee chalanam
Mari kada sanchalanam
Chinukalle modalay uppena kaadaa
Ee kathanam
Neelo jadiki chelarege alajadiki
Gelupalle modalai
Charithaga maare nee payanam

Nee aashayame thama kosamani
Thelisaakaa
Nuvvu lakshyamani thama rakshavani
Ninadinchelaa

Padara padara padara
Nee gathamuku kottha janmamidira
Nee yetthuku thagina lothu idhi
Tholi punaadi gadi
Thalupu terichi padaraa

Padara padara padara
Prathokkari kathavu nuvvu kadara
Nee oravadi bhavitha kalala vodi
Brathuku sadhyapadu
Sagubadiki badiraa

Thanani thanu thelusukunna halamuku
Polamutho prayanam
Thana loni rushi ni
Velikitheeyu manishiki ledu
Ye pramaanam

Ushassu entha oopirichhi
Penchina kaanthichukkavo
Tharala velithi vethiki
Theercha vacchina
Velugu rekavo

Listen to this Song Online

Song Credits:

Composer: Devi Sri Prasad
Lyrics: Shree Mani
Singer(s): Shankar Mahadevan
Music on: Aditya Music

Padara Padara Song Lyrics in Telugu

 

Previous

Nuvvani Idhi Needani song lyrics in telugu – Maharshi Movie

Paala Pitta Song Lyrics in Telugu – Maharshi Movie

Next

Leave a Comment

Pin It on Pinterest